ఇది నా స్వీయ కవిత
అమ్మ
అమ్మ
భువిలో వెలసిన దేవత
మన కి
ప్రాణం పోసిన అమ్మ
అరిష్టాల నుండి
కాపాడే అమ్మ
తాను పస్తులున్నా
మన కడుపు నింపే అమ్మ
తన కనులు
నిదుర లేమితో
ఎరుపెక్కినా
మనకి జోలపాడే అమ్మ
మన
చిన్న పాటి విజయాలు
తనకి అద్భుతాలు
బాధతో బిడ్డ
అమ్మా అంటే
తల్లి ప్రాణం విలవిలా
అమ్మ
ఉన్న ఇంట
ప్రతిరోజూ
దసరా పండుగ
No comments:
Post a Comment