Friday, 15 November 2024

నూటికో కోటికో ఒక్కరు

 మేమిద్దరం  సమాంతర రేఖలం. కానీ శాంతియుత సహజీవనం చేస్తుంటాం.


తను రాత్రి పదకొండుకైనా హుషారుగా ఉంటాడు.  నేను పన్నెండు కల్లా  లేచి కూర్చొని  ఇంకా హుషారుగా ఉంటాను.


తను  వంట బాగా  చెయ్యాలంటాడు. నేను ఏదో ఒకటి తింటే చాల్లే అనుకుంటాను. 

నేను అనుకోగానే ఆ పని అయిపోవాలను కుంటాను. తను మాటకైనా, పనికైనా తాపీ, తరుణం  ఉండాలంటాడు.


ఏమాటకామాటే చెప్పుకోవాలి,  లక్షల్లోనో, కోట్లలోనో ఒకరుంటారు మా కథానాయకుడు లాటి వాళ్ళు.

No comments:

Post a Comment