Sunday, 3 November 2024

పునాది

 ఇది  నా  స్వీయ ‌రచన

పునాది 


మురళి  సాదాసీదా జీవితం  ఒక మహా నగరంలో మొదలయింది. కాలేజీ చదువుకొచ్చేసరికి ఇంజనీరింగ్  కాక ఆర్ట్ గ్రూప్ లో చేరేసరికి అది అందరికీ  చర్చనీయాంశం అయింది. ఎవరేమనుకున్నా  మురళి, అతని  తల్లితండ్రులు  పట్టించుకోలేదు. 

డిగ్రీ అవగానే  మురళి ఉద్యోగ ప్రయత్నాలు  మొదలెట్టాడు. 

తన మీద  తనకున్న నమ్మకం,కష్టపడే తత్త్వం తో కొద్దికాలంలోనే  మురళి ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని  సంపాదించుకున్నాడు. 

కానీ  పోస్టింగ్ ఓ పల్లెటూరులో. 

స్నేహితులు అక్కడెలా బతుకు తావురా అన్నా అక్కడ కూడా  మనుషులే ఉంటున్నారు  కదా,గ్రామీణ భారతానికి అలవాటు ‌పడతానంటాడు మురళి  నవ్వుతూ. 

కొన్నాళ్ళయ్యేసరికి ఆఊరి ప్రజల అభిమానం, ఆప్యాయత, వారి జీవన విధానం అన్నీ  మురళికి అర్ధమయ్యాయి. ఊరికి తగిన వైద్య సదుపాయాలు ‌లేవని,తన స్నేహితుడితో ‌మాటాడి ఒక ఆసుపత్రి ఏర్పాటు  చేస్తాడు. 

మురళి  చెల్లెలు  పెళ్ళి అయ్యాక అతని తల్లితండ్రులు  మురళి తో"నువ్వు ఉన్న ఊరే మాకు హాయి.మేమూ అక్కడే ఉంటాం"అని అక్కడకే  వచ్చేసారు.

మరి కొన్నాళ్ళకు  మురళి  అదే ఊరిలో ఉంటున్న రాధని ఏ ఆర్భాటం లేకుండా  పెళ్లి  చేసుకున్నాడు."మురళీగానం రాధని వెతుక్కుంటూ  మా ఊరు  వచ్చింది "అని రాధ మురళితో  అంటూ  ఉంటుంది.

ఇక మురళి కి ఆ ఊరి నుంచి  ఏ ఊరికి బదిలీ  అయినా అతని మూలాలు అతనిని ధ్రుఢం గా నిలబెడతాయి.

No comments:

Post a Comment