Friday, 1 November 2024

ఆపన్నహస్తం

 ఇది నా స్వీయ రచన 

ఆపన్నహస్తం 


పొద్దున్నే పార్కు లో పరిగెడుతోంది  అశ్విని. ఆమెనే చూస్తోంది సుమతి. కొంతసేపయ్యాక అశ్విని వచ్చి సుమతి పక్కన కూర్చుంది. 

"ఎక్కడ ఉంటారమ్మా మీరు? " అడిగింది సుమతి.

"నేను, మా ఊరు అమ్మాయిలు మరో ఇద్దరం కలిసి ఇక్కడకి దగ్గరగా ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం." 

"మీ అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు?" 

"ఈ ఊళ్ళోనే. వాళ్ళకి నన్ను,మా అన్నని ఇద్దరినీ చదివించే స్తోమత లేదట. నన్ను ఇక ఇంట్లో కూచో అన్నారు. ఇద్దరినీ ఒకేలా చూడటం లేదని వాళ్లతో తగువాడి నేను  బయటకి వచ్చేసా. పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నా."

"నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావమ్మా"

కాలేజీ  పేరు చెప్పింది అశ్విని. 

"అది మా అమ్మగారి సంస్మరణార్ధం మా నాన్నగారు కట్టించేరు. నువ్వు ఆ కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకో. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. నువ్వు పార్ట్ టైమ్ ఉద్యోగం మానేయ్. నీకు ఏ అవసరం ఉన్నా ఇక మీదట నన్ను అడుగు. నా నంబర్  తీసుకో " అంది సుమతి.

సుమతి సాయంతో అశ్విని  బాగా చదువుకుంది.  పేరు మోసిన పాత్రికేయురాలయ్యింది.

అశ్విని  సుమతితో అంటుంటుంది "అమ్మా మీరు వికలాంగులయినా, ఎంతో గొప్ప మనసున్నవారు. నాలాటి వాళ్లకి  ఆపన్నహస్తం అందించిన వారు. మిమ్మల్ని ఏ కార్యక్రమానికైనా వీల్ ఛైర్ లో కూర్చోబెట్టి ఆయనే స్వయంగా తీసుకెళ్ళే మీ నాన్నగారి వాత్సల్యాన్ని, ప్రేమని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే"

No comments:

Post a Comment