Monday, 11 November 2024

పెద్దలు తలిస్తే

 పెద్దలు తలిస్తే. ......


అబ్బాయి, అమ్మాయి  సహ ప్రయాణీకులు. ఎవరి ప్రపంచంలో వారు.


అమ్మాయి రవళికి  అక్క ఎందుకు రమ్మందో తెలియదు. 

మురళికి  అన్నావదినలు ఎందుకు రమ్మన్నారో తెలియదు. 


రవళి  అక్క వాళ్ళ ఇంటికి  చేరేక వాళ్ళ అక్క  రవళిని తలంటుకోమని , తొందరగా భోంచేసి పడుక్కోమని , హడావుడి చేసింది. 


మురళితో వాళ్ళ  అన్న  సాయంత్రం  వదిన వాళ్ళ  స్నేహితురాలిని కలియడానికి వెళ్ళాలని  చెప్పేడు.

సాయంత్రం రవళి అక్క  కొత్త డ్రస్సు ఇచ్చి వేసుకుని తనతో రమ్మంది. 

మురళి, రవళిల పెళ్లి చూపులు అలా  ఓ హొటల్  లో   జరిగేయి.

పెద్దలు తలుచుకోబట్టి, పెళ్లి చూపులలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక పెళ్ళి కూడా జరిగిపోయింది.

No comments:

Post a Comment