Saturday, 2 November 2024

నా ప్రపంచం

 ఇది నా స్వీయ ‌రచన 

నా ప్రపంచం


ఇప్పుడు  కధ నా ప్రపంచం. ఒకప్పుడు కవిత నా ప్రపంచం. చిన్నప్పుడు పుస్తకాలు నా ప్రపంచం. కొంచెం పెద్దయ్యాక, రేడియోలో పాటలు వినడం మొదలెట్టాక ఇక అవే నా ప్రపంచం అయ్యాయి.

ఉద్యోగం వచ్చాక పిల్లలు, పాఠాలు ఇక అదే ప్రపంచం. 

పెళ్లయ్యాక  పిల్లలు, వాళ్ళ  పెంపకం, వాళ్ళ ఆటలు,చదువులు అదే ఓ ప్రపంచం అయిపోతుంది.మనవలు పుట్టాక వాళ్ళ  సంరక్షణ, ఆటలు ఇదే ఓ ప్రపంచం.

కాలానుగుణంగా మన ప్రపంచం మారిపోతుంటుంది. నా ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఉండటమే రోజూ నా పని.

No comments:

Post a Comment