ఇది నా స్వీయ రచన
"మేడం, మన ఆఫీసు లో వేకెన్సీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. మా స్నేహితుడు హాజరవుతున్నాడు. వాడు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడకి వచ్చేద్దామనుకుంటున్నాడు." అంది అరుంధతి.
"తనకి మెరిట్ ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతాడులే" అంది శశిరేఖ.
ఇంటర్వ్యూ బోర్డులో శశిరేఖ ఉన్నా అరుంధతి చెప్పిన సాగర్ ని ఏ ప్రశ్నలూ అడుగలేదు. ఆమె తండ్రి అన్ని ప్రశ్నలు, అనుభవం గురించి అడిగి చాలా సంతృప్తి చెంది సెలక్ట్ చేసేడు.
శశిరేఖ తండ్రి కూతుర్ని విదేశాలకు కూడా పంపించి చదివించి,శిక్షణ ఇప్పించి తన కంపెనీ బరువు బాధ్యతలు అప్పచెప్పాడు. భార్య కూతురి పెళ్ళి ప్రస్తావన తెస్తే ,తన జీవితం తన ఇష్టం అని అనేవాడు.
శశిరేఖ తమ కంపెనీ లో పనిచేస్తున్న వారి కోసం ఒక మేగజైన్ ప్రారంభించింది. దాని ప ని అరుంధతి కి, సాగర్ కి అప్పచెప్పింది. అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ,పిక్నిక్ , విహారయాత్రలు కూడా ఏర్పాటు చేసేది. వీటన్నిటికీ కుటుంబ సభ్యులని తీసుకురమ్మని ప్రోత్సహించేది.
ఆఫీసు పనికి సంబంధించి శశిరేఖ ఖచ్చితంగా ఉంటుంది కానీ అమ్మ తనతో ఉంటే అమ్మతో పాటు అందరితో కలిసిపోయేది.
ఒకరోజు శశిరేఖ వాళ్ల అమ్మతో " నాకు ఎప్పుడు పెళ్లి చేద్దామా అని నువ్వు చూస్తున్నావని నాకు తెలుసమ్మా. నాన్నకి ఒక అబ్బాయి గురించి చెప్పాను. రేపు మన కంపెనీలో పని చేస్తున్న అరుంధతి తో కలిసి ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్లి మాట్లాడండి"అని చెప్పింది.
శశిరేఖ తల్లితండ్రులకి కూతురి నిర్ణయం మీద చాలా నమ్మకం. వాళ్ళు సాగర్ తల్లితండ్రులతో తమ అమ్మాయిని వాళ్ళింటి కోడలుగా చేసుకోమని కోరేరు.
శశిరేఖ తండ్రి సాగర్ ని కొత్తగా ప్రారంభించిన మరో బ్రాంచికి అధినేతని చేసి, సాగర్ అంగీకారం తో వాళ్ళిద్దరి వివాహం జరిపించాడు.
No comments:
Post a Comment