ఇది నా స్వీయ రచన
వంశోధ్ధారకుడు
ఒక రాజ్యానికి రాజుగారు. రాజుగారికి లేకలేక కలిగిన కూతురు. రాజుగారు కూతురుకి అన్ని విద్యలతో పాటు యుద్ధ విద్యలు నేర్పారు.
యువరాణి యుక్త వయసుకి వచ్చేక తనకి రాజ్య సంరక్షణ లో సహాయకారిగా ఉన్న ఓ వీరుడికి ఇచ్చి వివాహం చేసేడు. కొన్నాళ్ళ తర్వాత కుమారైకే రాజ్యపాలన అప్పగించేడు.
ఆ రాణి పేరు మణిమేఖల.ఆమె తన ప్రజలని బాగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకుంది. పరిపాలనలో ఆమె భర్త సాయం ఎల్లవేళలా ఉండి పరిపాలన జనరంజకమయింది.
మణిమేఖల ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఆమెకి కూడా తల్లితండ్రులు అన్ని విద్యలు నేర్పి వీరవనితగ తీర్చిదిద్దారు.
యువరాణి పేరు శుభప్రద.మణిమేఖల ఇరుగుపొరుగు రాజ్యాలలో తన కుమారైకి సరి జోడైన రాజకుమారునికిచ్చి వివాహం చేసింది.మణిమేఖల మరికొన్నాళ్ళకి శుభప్రద కి రాజ్యపాలన బాధ్యతని అప్పచెప్పింది.
శుభప్రద కొద్ది కాలానికే ప్రతాపవర్ధనుడికి జన్మనిచ్చింది.
ప్రతాపవర్ధనుడి తల్లి సూర్యవంశానికి,తండ్రి చంద్రవంశానికి చెందినవారు.ఇరు వంశాలని కలిపి ఇరు వంశాలకి వంశోధ్ధారకుడై ప్రజలకి సుపరిపాలన నందించాడు.
No comments:
Post a Comment