Saturday, 2 November 2024

తాత 

 ఇది నా స్వీయ రచన 

తాత


 మన దేశంలో ఎన్ని గ్రామాలో,కుగ్రామాలో.ఆ కుగ్రామాల్లో ఒకటి నేను చూసేను.ఒక రైతన్నతో నాకు రక్త సంబంధం ఉంది కూడా. 

ఆయన కధ వింటే కన్నీరు ఉప్పొంగుతుంది.

ఆ కాలంలో ఏడుగురు పిల్లల తండ్రి కావడం ఆశ్చర్యం కాదు.కానీ ఆఖరి పిల్లడు ఆరునెలల వయసులో తల్లిని కోల్పోతే ఎంత దయనీయమైన పరిస్థితి. 

భార్య పోయినా ఆయన క్రుంగిపోలేదు.అందరు పిల్లలనీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసేడు.

భార్య పోగానే మరో తోడు వెతుక్కుంటాడు మగాడు.ఆయన తన  తమ్ముళ్ళ,మరదళ్ళ సాయంతో పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన కూతుళ్ళ పురుళ్ళు, తరువాతి వేడుకలు అన్నీ జరిపాడు కానీ తన జీవితంలోకి మరో తోడుని తెచ్చుకోలేదు. 

వ్యవసాయం ఆయనకి దైవం.ఆయన ఎంత అమాయకుడంటే కొడుక్కి  ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆ సంస్థ వారు చేరమని ఉత్తరం పంపితే, ఉద్యోగం పేరుతో కొడుకు ఎక్కడ దూరమవుతాడో అని ఆ ఉత్తరం కొడుకుకి చూపించకుండా దాచేసాడు.

"ఏమ్మా ఎక్కడిదాకా వచ్చింది నీ కథ" అని అడుగుతున్నారు నన్ను ఫోటోలోంచి.

No comments:

Post a Comment