Saturday, 2 November 2024

వీకెండ్

 ఇది నా స్వీయ రచన 

వీకెండ్ 


ఆ ఇంట్లో వారాంతపు సెలవులు తల్లీకూతుళ్ళకొకలా మామా అల్లుళ్ళకొకలా గడుస్తుంటాయి.మాధురికి తల్లి స్మిత అంటే చాలా ఇష్టం.సెలవురోజుల్లో తన తల్లితో ఎక్కువ సేపు గడపాలనుకుంటుంది.రాజకీయ నాయకురాలు కాకపోయినా స్మితకి ఉన్న జనాకర్షణ చాలా ఎక్కువ.తల్లి ప్రసంగం మొదలెడితే మాధురి మైమరచిపోతుంది.సభ నిర్వాహకులకు సహాయపడుతూ

సభ అనంతరం ,వచ్చిన వారి కోసం వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేస్తుంది మాధురి. 

మామగారు, అల్లుడు,మనవడు ఒక బృందం."హే సెలవురోజులు"అంటాడు మనవడు."మీ అమ్మమ్మ సింహం రా.ఇవాళ జనారణ్యంలోకి వెళ్లింది "అంటారు తాత." మామయ్యా ఇవాళ ఏం వండుకుందాం?రోజూ వంటవాడి వంట తినితిని కమ్మగా ఎప్పుడు తింటామా అని ఉంది "అంటాడు అల్లుడు. 

వాళ్ళింట్లో వారాంతపు సెలవులు అలా గడిచిపోతాయి.

No comments:

Post a Comment