ఇది నా స్వీయ రచన
ఒక్క మార్కు
"అయ్యో,ఒక్క మార్కు తగ్గింది రా.లేకపోతే నూటికినూరు వచ్చేవి"
"ఒక్క మార్కు తగ్గింది. లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది.
చిన్నప్పటి నుండి ఈ ఒక్క మార్కు గురించి వినివిని విసుగొచ్చింది.
ఒక్క మార్కు మీద ధ్యాస తప్ప తొంభై తొమ్మిది మార్కులు కూడా చాలా మంచి మార్కులు అన్న ధ్యాస లేదు.రెండో ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ అన్న ఊసేలేదు.
ఆ టీచర్స్ కూడా అంతే మరి.
"స్టెప్స్ అన్నీ వేయలేదు. అందుకే మార్కు తగ్గించా" అంటారు లెక్కల మాస్టారు.
"జవాబు పత్రంలో అక్కడక్కడా తప్పులు దొర్లాయి. అందుకే ఒక మార్కు తగ్గింది " తెలుగు మాస్టారి వివరణ.
"సైన్స్ లో బొమ్మలు బాగా వేయాలండీ. లేకపోతే నేను మార్కు తగ్గిస్తా"అంటారు సైన్స్ టీచర్.
" మ్యాప్ పాయింటింగ్ సరిగ్గా చేయాలికదమ్మా"అంటారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు.
ఎంసెట్ లో ఒక్క మార్కు తేడా తో ఎన్నో ర్యాంక్ లు వెనక్కి వెళ్ళా.
ఆరోజు నిర్ణయం తీసుకున్నా. ఒక్క మార్కు అంటూ ఎప్పుడూ ఎవరిమీదా ఒత్తిడి తేకూడదని.
No comments:
Post a Comment