Friday, 1 November 2024

వాణి నా రాణి

 ఇది  నా స్వీయ  ‌రచన 

వాణి నా రాణి 


అమ్మ ఒక అమ్మాయిని మా ఇంటికి తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి పేరు వాణి. అమ్మ స్నేహితురాలి కూతురు. 

వాణి పదో తరగతి వరకే చదువుకుంది. అమ్మ వాణిని ఓ మంచి కాలేజీ వెతికి వెతికి ఎంపిక చేసి అందులో చేర్చింది. అమ్మ రోజూ తనే స్వయంగా కారులో దిగపెట్టేది. తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేది. 

సెలవు రోజుల్లో అమ్మ ఎక్కడకి  వెళ్లినా తనతో  తీసుకెళ్ళేది. అప్పుడప్పుడు వాణిని వాళ్ళ ఊరు కూడా తీసుకుని వెళ్ళేది. 

వాణి బాగా చదువుకుంది. నేనింకా బాగా చదివినా అమ్మకి వాణి అన్ని విషయాలలో నచ్చుతుంది.

వాణి తను చదువుకున్న కాలేజీ లో లెక్చరర్ అయింది. ఓ రోజు మా అమ్మ "వాణికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దామనుకుంటున్నాం వాళ్ల  అమ్మ, నేను " అని నాతో అంది. "ఆ మంచి అబ్బాయిల జాబితా లో  నేను లేనా" అని అడిగా అమ్మని.

అమ్మ "మీ నాన్న  నీకు మంచి స్నేహితుడు అంటావుగా.ఆయన సిఫార్సు చేస్తే వాణి, నేను ఆలోచిస్తాం" అంది నవ్వుతూ. 

అలా వాణి నా రాణి అయిపోయి నా కథ సుఖాంతమయింది.

No comments:

Post a Comment