ఇది నా స్వీయ రచన
తోబుట్టువు
హేమ పుట్టినపదేళ్ళకి ఆమెకు తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుడుతూనే హేమ తల్లి మరణించింది. తమ్ముడుని తనే తల్లిలా సాకింది హేమ.
తన పెళ్ళి అయ్యాక తమ్ముడు గోపిని తనతో పాటు అత్తవారింటికి తీసుకెళ్ళి పోదామనుకుంటుంది కానీ అది జరగలేదు. అత్తవారిల్లు అదే ఊరిలో ఉన్నా ఆమె పుట్టింటికి రావాలంటే చాలా ఆంక్షలు.అత్తగారికి, భర్తకు ఇష్టముండదని ఆమె తండ్రి, తమ్ముడు కూడా వాళ్ళింటికి వచ్చేవారు కాదు.
హేమ తండ్రి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండేది.హేమ ఇంటిదగ్గరే ఏవో పనులు చేసి, ఎంతో కొంత సంపాదించి తమ్ముడి చదువుకి,తండ్రి మందులకు తన అకౌంట్ నుండి డబ్బులు పంపేది.తమ్ముడు కోసం ఏవైనా చేసి తన స్నేహితురాలితో పంపేది.
హేమ తండ్రికి గోపి గురించి ఎక్కువ చింత ఉండేది. తను ఎప్పుడైనా కనుమూస్తే గోపి పరిస్థితి ఏంటన్న దిగులు హేమ తండ్రికి ఎప్పుడూ ఉండేది. హేమ తన భర్తతో "ఇప్పుడు నా అవసరం నా తండ్రికి ,తమ్ముడికి ఎక్కువ ఉంది. కొన్నాళ్ళు నేను మా పుట్టింట్లో ఉండి,మా తమ్ముడికి కావలసినవి ఏర్పాటు చేసి వస్తా "నని చెప్పి కూతురితో పుట్టింటికి బయలుదేరింది.
No comments:
Post a Comment