Friday, 1 November 2024

వీలునామా

 ఇది నా స్వీయ రచన.

వీలునామా 


 శ్రీనివాస్, రవి ఇద్దరూ అన్నదమ్ములు. తండ్రి వ్యవసాయాన్ని ఇద్దరూ కొనసాగించారు.వాళ్ళ తండ్రి ముందుచూపుతో తను,పిల్లలు ఉండటానికి పెద్ద ఇల్లే కట్టించాడు. 

తండ్రి ఉన్నన్నాళ్ళూ, అందరూ కలిసే ఉండేవారు.ఇద్దరికీ తల్లి చాలా ఇష్టం‌ కావడం వల్ల విడిపోదామన్న ఆలోచన కూడా  చేయలేదు. 

శ్రీనివాస్ కి కూతురు, కొడుకు. రవికి ఒక్కడే కొడుకు. శ్రీనివాస్  కూతురు పేరు  మమత.శ్రీనివాస్  కూతురంటే అందరికీ అపురూపం.

శ్రీనివాస్ తండ్రి   బతికి ఉన్నప్పుడే మనవరాలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేడు. 

శ్రీనివాస్ కొడుకు కల్యాణ్.రవి కొడుకు వినోద్.తాత ఇద్దరినీ పట్నం పంపించి చదివించాడు.వా ళ్ళిద్దరూ పట్నంలో సెటిల్ అవుదామనుకుంటారు.ఇద్దరూ పట్నంలో ఉద్యోగాలు చేస్తుంటారు.ఊళ్ళో ఇల్లు, పొలం అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ఇద్దరికీ ఉంటుంది.ఇద్దరూ వాళ్ళ ఉద్దేశ్యాన్ని వాళ్ల తల్లితండ్రులకి చెప్పేరు. 

శ్రీనివాస్, రవి వాళ్ళ కుటుంబ లాయర్ని వాళ్ళతో మాట్లాడమంటారు.లాయర్  వాళ్లిద్దరితో"మీ తాత ముందు చూపున్నవాడు.ఆయన పొలాలు, ఇల్లు అమ్మగా వచ్చే ఆస్తి తన భార్యకీ, తన ఇద్దరు కొడుకులకీ, ఇద్దరు కోడళ్ళకీ, ముగ్గురు మనవలకీ సమానంగా పంచాలని

తన వీలునామాలో రాసేరు. ఇంతమందికి సమానంగా పంచితే

మీ ఇద్దరికీ వచ్చే వాటా తక్కువ. ఉమ్మడి ఆస్తిగా ఉంటే వ్యవసాయం మీద ప్రతిఫలం బాగుంటుంది"అని చెప్పేడు. 

కల్యాణ్, వినోద్ లకి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

No comments:

Post a Comment