ఇది నా స్వీయ రచన
లేడీ బాస్
మహిళా సాధికారతకి నిలువెత్తు రూపం జయమ్మ. ఆవిడ పెళ్లికి ముందు ఎక్కువ చదువుకోలేదట.
ఆవిడ భర్త మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు. జయమ్మ మహా చురుగ్గా ఉండేది.కారా కిళ్ళీ బుగ్గన పెట్టుకుని అందరి మీదా ధాష్టీకం చేస్తుంటే మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం.
అప్పట్లో జయమ్మ రెండు సినిమా థియేటర్ ల యజమాని.ట్యూషన్లు పెట్టించుకుని జయమ్మ రెండు మూడు భాషలు బాగా మాటలాడటం నేర్చుకుని ,ధనిక వర్గంలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.
రాజకీయాలలో చేరి చివరికి మేయర్ జయమ్మ అనిపించుకుందంటే ఎంతోమందికి ఆదర్శ ప్రాయురాలే మరి.
No comments:
Post a Comment