Friday, 1 November 2024

అపార్ధం

 ఇది నా స్వీయ ‌రచన 

అపార్ధం 


కాంతమ్మ ఈ మధ్య ఓ ప్రత్యేకమైన పని సాయంత్రం పూట పెట్టుకుంది. కాంతమ్మ,ఆమె భర్త  మొదటి అంతస్తులో ఉంటే రూప,వాళ్ల అమ్మ రెండో అంతస్తులో ఉంటారు. రూప దగ్గరగా ఉన్న ఓ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తోంది.  ఈ మధ్యే రూప తల్లి పెద్ద కూతురుకి అవసరముండి మరో ఊరు వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి రూప సాయంత్రం కాలేజీ నుండి వచ్చినపుడు  రూప తో కలిసి ఓ అబ్బాయి వస్తున్నాడు. ఇద్దరూ మెట్లెక్కి రెండో అంతస్తుకి వెళ్ళడం రోజూ కాంతమ్మ చూస్తుంటుంది. ఆ అబ్బాయి మరో గంట తర్వాత మెట్లు దిగి వెళ్ళిపోవడం కూడా కాంతమ్మ చూస్తుంటుంది. వాళ్ళిద్దరూ మెట్లు ఎక్కి వెళ్ళడం,ఆ అబ్బాయి ఒక్కడే దిగి వెళ్ళిపోవడం చూడటమే కాంతమ్మ  పని.

కాని దానితో ఆవిడ ఆరాటం ఆగలేదు.

ఓ వారం రోజులు చూసాక కాంతం రూప  వాళ్ల ఇంటి ఎదురింట్లో ఉన్న అనంతలక్ష్మి ని సంగతేమిటని అడిగేసింది కూడా. 

అనంతలక్ష్మి కూతురు అరుణ రూపకి స్నేహితురాలు. 

"ఆ అబ్బాయి రూప కాలేజీ లో అటెండర్ ట.ఏవో పరీక్షలు రాస్తున్నాడట. రూపని సాయం చేయమని అడిగాడుట. రూప హాల్లో చెప్తుంటే వినడానికి నాకెంత బావుంటుందో. చాలా జాగ్రత్తైన పిల్ల. పై వాళ్లు ఎవరు ఇంటికి  వచ్చినా తలుపు తీసే ఉంచుతుంది. బంగారు తల్లి. ఎవరు బంగారు పూలతో పూజ చేస్తున్నారో,ఆ అమ్మాయిని పెళ్లి  చేసుకోవడానికి " అంది అనంతలక్ష్మి.

No comments:

Post a Comment