ఇది నా స్వీయ రచన
దండెం
దండెం అని తలుచుకుంటే నాకు మానాన్నగారు గుర్తొస్తారు.మా ఇంటికి వస్తే నేను అడగక పోయినా దండేలు కట్టేసేవారు.మేమంతా కలిసి రెండు మూడు రోజులు ఎక్కడికయినా వెళ్తే బట్టలారేసుకోవడానికి దండేలు కట్టేసేవారు.
ఆ దండేలు పైకి కట్టేసేవారని"ఎక్కడో అంతరిక్ష మార్గాన కడతారని అమ్మ విసుక్కునేది.వాళ్లిద్దరూ నెలరోజులు తీర్ధ యాత్రలకి వెళ్లినా తక్కువ బట్టలతో ప్రయాణం చేసేవారు. అన్నిచోట్ల బట్టలు తడిపి ఆరవేసుకోవడమే.
మేము ఎక్కడ ఉన్నా ఆయన కట్టిన దండేలే చివరి గుర్తుగా మిగిలిపోయాయి.
No comments:
Post a Comment