Wednesday, 6 November 2024

అమ్మతనం

 ఇది  నా స్వీయ రచన 


అమ్మతనం


ఆరుద్ర.....సినీ కవి అనుకున్నారేమో....నా కథానాయిక ఆమె. ఆ పేరంటేనే బలే ఇష్టం  నాకు.

ఆరడుగుల ఎత్తు, చక్కటి నవ్వు, నొక్కుల జుత్తు. ఆరుద్ర భర్త అమాయకత్వం, అత్తగారి అతి మంచితనం ఆమెకి కష్టాలే తెచ్చిపెట్టాయి. పెళ్ళయినప్పటి నుండి ఆమె కష్టజీవే.

ఆరుద్ర కి తొలి కాన్పు కవలలు. ఇద్దరూ అబ్బాయిలు. ఇద్దరూ అర్భకంగానే పుట్టారట. వాళ్లు బతుకుతారో లేదో అనే అందరూ అనుకున్నారట. మరో రెండేళ్ళకే మళ్ళీ కవలలు. మళ్ళీ మగపిల్లలే.ఆరుద్ర ఆ పిల్లల అల్లరి భరించలేక పోయేది.

 ఆరుద్ర అత్తమ్మ, భర్త సింహాచలం ఆరుద్ర  పిల్లల మీద కోపమొచ్చి రంకెలేస్తే పిల్లలని దూరంగా తీసుకుని వెళ్ళిపోయేవారు.


ఆరుద్ర పిల్లలని పెంచింది.  ఎంతో కొంత చదువు చెప్పించింది. అవసరమైనప్పుడు  తనతో పనికి తీసుకెళ్ళింది. తన చెల్లి ఒక ఆడపిల్లని ప్రసవించి చనిపోతే ఆ పాపకి తానే తల్లి  అయి పెంచింది ఆరుద్ర. 

పిల్లలందరికీ తల్లంటే భయం, భక్తి. ఏది కావాలన్నా బామ్మ కో, అయ్యకో చెప్పేవారు. చెల్లెలు దుర్గకి ధైర్యమెక్కువే.


దుర్గకి ముందు  పెళ్లి చేసి తన బాధ్యత  తీర్చుకుంది. పిల్లలంతా  పెళ్లిళ్లు అయ్యాక వేరేగానే ఉంటారు. దుర్గ ఆరుద్ర దగ్గరకి వచ్చి  పోతుంటుంది.


దుర్గ దగ్గరకి వెళ్తే అన్నీ చేసి తీసుకెళ్ళేది ఆరుద్ర. "నా చెల్లి  పేరే దాని కూతురికి దుర్గ అని పెట్టా. ఎంత చూసినా, ఎంత చేసినా నేను సొంత తల్లి ని కాలేను కదమ్మా " అంటుంది ఆరుద్ర.

No comments:

Post a Comment