Saturday, 2 November 2024

నల్లపిల్లి

 ఇది నా స్వీయ రచన 

నల్లపిల్లి 


ఫైల్ పట్టుకుని బయలుదేరా.అమ్మో,నల్లపిల్లి ఎదురయ్యింది.అసలే ఉద్యోగ ప్రయత్నం. అందులోకీ ఈ ఉద్యోగం నాకు  చాలా  అవసరం. 

ముందు  రాత పరీక్ష ఉంది. ఇందులో  నెగ్గితే  ఇంటర్వ్యూ. పరీక్షాఫలితాలు మరి కొద్దిసేపటికి  తెలుస్తాయి. 

నల్లపిల్లి  ఎదురు రావడం మంచి శకునం  కాదనేది మూఢ విశ్వాసమే  అయినా  ఇంటర్వ్యూ కి ఎంపిక చేయబడనంతవరకూ భయమే. 

ప్రభుత్వ  ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కలెక్టరుగారే స్వయంగా  చేస్తున్నారు.అందులో  కూడా  నెగ్గినంతవరకూ భయమే. 

ఫలితాలు కూడా  వెంటనే తెలియడం తో కళ్ళు మూసుకుని నల్లపిల్లి కి ధన్యవాదాలు చెప్పుకున్నా.

No comments:

Post a Comment