ఇది నా స్వీయ రచన
అక్కాచెల్లెలు
పూజిత,రవళి రామారావు గారి ఇద్దరు కూతుళ్ళు,ఆయనకి రెండు కళ్ళు. పూజిత తన పని తాను చేసుకుపోతుంది.రవళికి తన ఆట, తన స్నేహితులు, వాళ్ళతో షికార్లు.
పూజిత ఇంటిపనిలో, వంటపనిలో తల్లికి సాయం చేసేది.రవళి భోజనం సమయానికి ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళకి కూడా అన్నం పెట్టమనేది.వాళ్ళ అమ్మ విసుక్కున్నా పూజిత ఎప్పుడూ చెల్లిని సమర్ధించేది.
పూజితకి చదువు, పని, పాటలు వినడం, పాటలు పాడుకోవడం అదే దినచర్య. అక్క పాటంటే రవళికి చాలా ఇష్టం.
డిగ్రీ తరువాత పూజిత ఇంకా కష్టపడి చదివి ఐఎఎస్ కి ఎంపికయింది.రవళి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడలలో గెలుపొంది మంచిపేరు తెచ్చుకుంది.
అక్కాచెల్లెలు కలిస్తే వాళ్ళ కబుర్లకి అంతుఉండదు.
"మనమిద్దరం అక్కాచెల్లెళ్ళం కాబట్టి ఇంత అన్యోన్యంగా ఉంటున్నాం" అని వాళ్ళిద్దరూ అనుకుంటుంటారు
No comments:
Post a Comment