Wednesday, 6 November 2024

దిద్దుబాటు

 ఇది నా స్వీయ రచన

   దిద్దుబాటు


ఓ స్వతంత్ర భారతమా 

జనాభాలో తొలి స్థానం మనదైనా

ఒలింపిక్స్ లో మన స్థానం అట్టడుగునేలమ్మా

మహిళల క్రికెట్ హాకీలను 

భారతావనిలో ఆదరించేదెపుడమ్మా

మహిళా దినోత్సవ ఆర్భాటాలేగాని

చట్టసభలలో మహిళా రిజర్వేషన్ 

చర్చలేమాయె

ఆకాశాన్నంటే అత్యవసర వస్తువుల‌ ధరలు 

నిరాశ నిండిన నిరుపేదల బతుకులు 

డిగ్రీలు చేపట్టిన యువత

భద్రత లేని వారి భవిత


విదేశాలలో భారతీయులు నేర్పుతారు 

తమ పిల్లలకు మన భాషా సంస్కృతులు

కానీ మరలిరాలేరు మాతృదేశానికి

దిద్దుకోవమ్మ నిన్ను  నువ్వు 

భారత ప్రజాస్వామ్యమా

No comments:

Post a Comment