ఇది నా స్వీయ రచన
క్రాంతి
క్రాంతి ,నేను కలిసి టీచర్ ట్రైనింగ్ అయ్యాము కానీ ఇద్దరికీ మరీ ఎక్కువ స్నేహం లేదు. అప్పుడు కూడా తను ఏవో పుస్తకాలు చదువుతూ,రాస్తూ,ఏవో సమావేశాలకు హాజరవుతూ నిరంతరం పనులతో తలమునకలయ్యేది.
క్రాంతి వాళ్ల అమ్మ,నాన్న ఎక్కువ చదువుకోలేదు. ఏవో చిన్న ఉద్యోగాలు చేసేవారు. ఆమెది విప్లవపంధా. విప్లవ గీతాలు రాస్తూ, పాడుతూ ఉపాధ్యాయురాలిగా పనిచేసినా ఆ మార్గాన్ని వదలలేదు. ఆమెకి గొప్ప ఉపాధ్యాయురాలిగ మంచి పేరుంది.
క్రాంతిది దళిత కుటుంబం. దళితుల పోరాటం ఆమె పోరాటం. వారిని సమైక్యంగా ఉంచాలని,వారిలో అవగాహనని,సామాజిక స్పృహ ని పెంచాలని నిరంతరం తపన పడుతుంటుంది.
క్రాంతి స్త్రీవాది కూడా.ఆమె కవిత్వం,రచనలు నాకు కనిపించినప్పుడల్లా, దొరికినప్పుడల్లా చదువుతాను.
క్రాంతిని నేనెక్కువగా ఇష్టపడతాను. క్రాంతి ఏ సమావేశాలలో పాల్గొన్నా వాటికి నేను హాజరవుతాను. నన్ను చూస్తే క్రాంతి ఆప్యాయంగా పలకరిస్తుంది.
క్రాంతి చేస్తున్నవి మూడు పోరాటాలు. తన జీవితమే ఓ పోరాటం. నేను క్రాంతిని కలిసినప్పుడల్లా ఎంతో కొంత నాకు తోచినది, నేను ఇవ్వగలిగేది ఇవ్వడం నా అలవాటు.
క్రాంతి నాకెప్పుడూ ఆదర్శం.తన దారిలో నేను నడవలేను. దానికి కారణం నా పిరికితనమేమో. కాని క్రాంతిని నా జీవితంలో కలిసినందుకు నేను చాలా సంతోషిస్తుంటాను. ఇద్దరి జీవితాలు సమాంతర రేఖలే అయినా ఆమె ఆశయసాధనకి
చేయూతనిద్దామన్న తలంపే ఎంతో ఆనందాన్నిస్తుంది నాకు.
No comments:
Post a Comment