ఇది నా స్వీయ రచన
తరాలు
మా తాతగారి అమ్మ, నాన్నల తరంనుండి మనవలతరం వరకు ఎంతో కొంత చూసినదాన్ని.చరిత్ర పుటల్లో ఎన్నో తరాలగురించి ఎంతో కొంత తెలుసుకున్నదాన్ని.
అమ్మ తాతగారు నాకు ముసలి తాతగారు. నాకు అమరం,శబ్దమంజరి నేర్పించడం మొదలెట్టేరు.ఆ వయసులో వాటి మీద ఆసక్తిలేక మూడోరోజు నుండి ఎగ్గొట్టడం మొదలెట్టా.
మా నాయనమ్మ ఆఖరికొడుకు ఆరునెలల వయసప్పుడు మరణించేరు.అప్పటి నుండి మా తాతగారు వ్యవసాయం చేసుకుంటూ,పిల్లలని,మనవలని చూసుకుంటూ అలాగే గడిపేసారు.
మా నాన్నగారు ఉద్యోగం వెతుక్కుని పల్లె నుండి నగరానికి తరలివచ్చారు.ఆయన ఉద్యోగం ఒకచోట,పిల్లల చదువులకోసం అమ్మ మరొకచోట.
మాతరం కి వచ్చేసరికి పిల్లల చదువు కోసం మంచి ఉద్యోగం వదులుకొని నేనే మరొకచోటకి వెళ్లిపోవలసి వచ్చింది. అప్పుడు మేము చదువులకే ప్రాధాన్యతనిచ్చేం.
తరువాత తరం చదువుతో పాటు ఆటలకి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు.
కాలుష్యం, అనారోగ్యం పెరిగిపోతున్నాయి.పిల్లలు ఇంకా విభేదాలు, విద్వేషాలు తెలియని ప్రాయంలో ఉన్నారు.వారి కాలం నాటికైనా కులం కొట్లాటలు, మత రాజకీయాలు అంతరిస్తాయని ఆశిద్దాం.
No comments:
Post a Comment