ఇది నా స్వీయ రచన
కాలక్షేపం
అమ్మలక్కలు కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటారు. కొంతమంది అయ్యవార్లు క్లబ్బులో పేకాడుతారు.
నేను ప్రయాణం లో కాలక్షేపానికి పల్లీలు లాగిస్తుంటాను
అయితే పల్లీలు ఎక్కువ తింటే తలతిరగుతుందంటారు.
నా చిన్నప్పుడు రైలు ఎక్కిన దగ్గర నుండి మా నాన్నగారిని పల్లీలు కావాలని అడిగేదాన్ని. ఒకసారి మాతో ప్రయాణిస్తున్న ఓ ఫారెస్టు ఆఫీసర్ గారు మా నాన్నగారితో "మీరు రైల్వే ఉద్యోగి కదా.రైలులోనే పల్లీ ప్లాంటేషన్ వేయించేయండి" అన్నారు నన్ను ఆటపట్టిస్తూ.
పల్లీలగురించి నేనెప్పుడయినా మాటలాడటం మొదలెడితే మా చిన్నమ్మాయి వెంటనే "అవునవును మాకు తెలుసు. మీ పుట్టింటి వాళ్ళకు పల్లీలు, నువ్వులు,చెరుకు పండేవి.అన్నీ వాణిజ్య పంటలు " అని గబగబా అనేసి నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లేస్తుంది.
కాలక్షేపానికి పుస్తకాలు చదువుకోవడం, కవితలు, కధలు చదువుకోవడం ఉత్తమోత్తమం.
No comments:
Post a Comment