ఇది నా స్వీయ కథ
సత్కాలక్షేపం
జానకి ,కృష్ణ మూర్తి స్వంత ఇంట్లో ఉంటున్నారు.జానకి కి ఈమధ్య ఓ సమస్య వచ్చి పడింది. చక్కెర వ్యాధి ఉండటంవల్ల బరువు తగ్గాలి.ఊళ్ళో కుక్కల బెడద వల్ల బయటకి రాలేకపోతోంది.
జానకి కృష్ణమూర్తి తో వేరే ఇంటికి మారదాం అంది. కృష్ణమూర్తి కుదరదన్నాడు.
జానకి అలా అయితే "నేనొక్కర్తినీ
గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను." అనగానే మారు మాట్లాడకుండా ఆవిడతో పాటు భవన సముదాయం లో అద్దె ఇంటికి మారేడు.
జానకి ఒక్కర్తే వాకింగ్ కి వెళ్ళేది.
కృష్ణ మూర్తి పెద్దల సభలో రాజకీయాలు చర్చించేవాడు.ఒకచోట కొందరు ఆడవాళ్ళు లలితా సహస్రం చదువుకునేవారు.
జానకి సొంత ఇంటిని అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కొంత సామాను, ఒక మంచం అక్కడే ఉంచేసారు.
మనవలకి కమ్యూనిటీ నచ్చుతుంది. ఆడుకోవడానికి బాగుంటుంది. మనవలు అప్పుడప్పుడు వచ్చేవారు.
వేసవి లో కమ్యూనిటీలో నీళ్లకి ఇబ్బంది వచ్చింది. చాలా ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
కృష్ణమూర్తి కి స్నేహితులు ఎక్కువయ్యారు. వాళ్లని రోజూ కలిసి కబుర్లు చెప్తేకానీ తోచేది కాదు.
జానకి "కొన్నాళ్ళు మళ్ళీ మన ఇంటికి వెళ్ళి ఉందాం. ఇక్కడ పిల్లలు వచ్చినా నీటికి ఇబ్బంది ఉంది కదా. ఇంటి చుట్టూ సిమెంటు గచ్చు చేయిస్తే పగలు,సాయంత్రం నేనక్కడ నడుస్తాను. మంచి ఉయ్యాల పెట్టిస్తే పిల్లలకి కాలక్షేపం " అంది.
"మరి నాకేం ఊసుపోతుంది" అన్నాడు కృష్ణమూర్తి.
"మీరు మరో నాలుగు వార్తా పత్రికలు తెప్పించుకోండి "అంది.
"చిత్తం" అన్నాడు కృష్ణమూర్తి.
No comments:
Post a Comment