ఇది నా స్వీయ రచన
అభయం
సావిత్రమ్మ గారు భయం ముందు పుట్టి తరువాత ఆవిడ పుట్టింది
అకస్మాత్తుగా భర్త మరణించడం ఆ భయానికి కొంత కారణమై ఉంటుంది.
కొడుకు ఆఫీసు నుంచి రావడం కొంత ఆలస్యమైతే కాలు కాలిన పిల్లిలా అటూఇటూ తిరిగేస్తూ ఉంటారు.
మనవరాలు వందన చీకటి పడ్డాక ఎక్కడికి వెళ్ళినా భయమే.
వందన ఆటలాడితే భయం.కూర తరిగితే భయం. పిడుగు పడితే భయం. వేగంగా కారు నడిపితే భయం.
ఒకరోజు వందన "నాన్నమ్మా నేను పోలీసు శిక్షణ తీసుకోవడానికి వెళ్ళాలి.నీ మనవరాలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్. నువ్వు చాలా ధైర్యం గా ఉండాలి " అని వెళ్ళి పోయింది.
జిల్లా లో పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టేక వందన సావిత్రమ్మ గారి దగ్గర కి వచ్చి "నానమ్మా నువ్వు కొన్నాళ్ళు నా దగ్గర ఉండాలి. నిన్నే కాదు, జిల్లా అంతటనీ నేనే చూసుకుంటాను, మందరగిరి మోసిన కృష్ణుడి లా" అంటూ నవ్వుతూ అభయమిచ్చింది.
No comments:
Post a Comment