Saturday, 2 November 2024

ఒంటరి

 ఇది నా స్వీయ ‌రచన 

ఒంటరి


భానుమూర్తిది ఒంటరి జీవితం. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. తన  వంట తనే వండుకుంటాడు.తన పనులు తనే చేసుకుంటాడు. 

పిల్లలు ఉన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడడు.ఎవరి  జీవితాలు వారివి అనుకుంటాడు. 

భార్య పోయిన నాటినుండి ఒంటరి జీవితమే.అతని ఇంట్లో ఓ చిన్న పుస్తక ప్రపంచం ఉంది.తనకు నచ్చిన పుస్తకం కొని తెచ్చుకుని తీరిక వేళల్లో చదువుకుంటుంటాడు.

ఒకొక్కప్పుడు ఎవరైనా వచ్చి "మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయట.మేము ఇక్కడే కూర్చుని చదవచ్చా" అని అడిగి,అక్కడే చదివి వెళ్తుంటారు. 

భానుమూర్తి  తరచూ దగ్గరలో ఉన్న వృద్దాశ్రమాలకి వెళ్తుంటాడు.ఎప్పటికైనా తనూ ఏదో ఒక వృద్దాశ్రమంలో చేరవలసినవాడే అనుకుంటుంటాడు.

No comments:

Post a Comment