Sunday, 3 November 2024

అడవి బిడ్డ

 ఇది  నా స్వీయ ‌రచన 

అడవి బిడ్డ 

మణి ఏజన్సీ ప్రాంతం నుండి వచ్చి పట్నం లో మహిళా కళాశాల లో చేరింది. 

భిన్న వాతావరణం,విభిన్న వ్యక్తులు,విభిన్న వ్యక్తిత్వాల మధ్య మసలవలసి రావడం వల్ల మొదట్లో చాలా  బిడియంగా  ఉండేది 

"మీ ఏజన్సీ ప్రాంతంలో చాలా  నాగుపాములు వుంటాయేమో కదా,అందుకే  నీకు  నాగమణి  అని పేరు పెట్టారా " అని ‌క్లాస్మేట్  అడిగితే, "మణిలా దేదీప్యమానంగా ‌వెలిగి పోతుందని " అని తనతో స్నేహం చేసిన  స్వర్ణ నవ్వుతూ  చెప్పింది. 

మణి డిగ్రీ  పూర్తి చేసి  మరి కొన్నాళ్ళు అక్కడే‌ ఉంది.తను  ఉద్యోగం సంపాదించుకుంటే  గాని‌ ఇంటికి  తిరిగి  వెళ్ళలేదు. తమ వారికి  జరిగే అన్యాయాలని,దౌర్జన్యాన్ని ,దోపిడీని ఎదుర్కోవాలంటే  తను పోలీస్  కావాలి. 

మరి కొన్నాళ్ళకు అడవి బిడ్డ పోలీస్  గానే వాళ్ల ఊరిలో అడుగు పెట్టింది.

No comments:

Post a Comment