ఇది నా స్వీయ రచన
హోమ్ వర్క్
"అబ్బో చాలానే ఉందే" అనుకున్నాడు రక్షిత్.
వైరల్ ఫీవర్ రావడంతో బడికి వారం రోజులు సెలవు పెట్టాల్సివచ్చింది.ఈ వారం రోజులు ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్, ఇచ్చిన హోమ్ వర్క్ అంతా ఇంతా కాదు.
పరీక్షలు వస్తున్నాయని అందరు టీచర్స్ సిలబస్ పూర్తి చేస్తున్నారు. కొందరు టీచర్స్ మిగతావాళ్ళని బతిమాలి వాళ్ళ పిరియడ్స్ తీసుకుని మరీ సిలబస్ పూర్తి చేస్తున్నారు.
రక్షిత్ స్నేహితురాలు సుభాషిణి రక్షిత్ వాళ్ల ఇంటి ఎదురుగా ఉంటుంది.రక్షిత్ జ్వరం తగ్గేక రక్షిత్ ఇంటికి వచ్చి బడి సంగతులు చెప్పింది.
రక్షిత్ "నోట్స్ రాస్తాను, హోమ్ వర్క్ చేస్తాను" అంటే సుభాషిణి "నోట్స్ నేను నీకు రాసి పెడతాలే.అన్ని సబ్జెక్ట్స్ వి కలిసి ఎక్కువ ఉన్నాయి. నీకు ఒంట్లో బాలేదు కాబట్టి ఏ టీచర్ ఏమీ అనరులే" అని హామీ ఇచ్చింది.
"హోమ్ వర్క్ కూడా నావి చూసి రా సేయ్.నీకు ఏవైనా అర్ధం కాకపోతే నేను చెప్తాలే " అని అలాగే తెలియనివి అడిగితే టీచర్స్ లాగే చెప్పింది.
హోమ్ వర్క్ చేస్తున్నంతసేపూ రక్షిత్ వాళ్ల అమ్మ "ఇంకా ఎంతసేపు ?ఆపి కాసేపు రెస్ట్ తీసుకో "అని చెప్తూనే ఉంది.
వారం రోజుల తరువాత బడికి వెళ్తే రక్షిత్ కి చాలా బావుంది. అందరు టీచర్స్ కీ హోమ్ వర్క్ చూపించేడు.
హోమ్ వర్క్ నోట్స్ వెనక్కి తీసుకున్నాక టీచర్స్ ఏం రాసేరో చూడటం రక్షిత్ కి అలవాటు . పుస్తకాలు తెరిచి చూస్తే అందరూ వెరీగుడ్ అని రాసేరు.రక్షిత్ " థేంక్యూ సుభాషిణీ"అనుకున్నాడు.
No comments:
Post a Comment