Saturday, 2 November 2024

నాటకాల రాయుడు

 ఇది  నా స్వీయ ‌రచన 


నాటకాలరాయుడు


ఏ కళ ఎవరి నుండి ఎవరికి  అబ్బుతుందో మనకి తెలీదు. రావుగారు  నటులు ఎలా అయ్యారో ఆయనకే తెలీదు. 

 నటనంటే రావుగారికి ప్రాణం. 

చదువుకునే రోజుల్లో, ఉద్యోగం లో చేరేక కొన్నాళ్ళు రావుగారు  ఎన్నో నాటకాలు  వేసేరు. నటనలో  బాగా  రాణించేరు.ఎన్నో  పురస్కారాలు,ఎందరినుండో   తన నటనా పాటవానికి అభినందనలు  అందుకున్నారు  రావుగారు. 

సంసార సాగరం‌ ఈదడం మొదలెట్టాక,ఆఫీసులో పని  ఎక్కువయ్యాక ఆయన నాటకాలు  వేయడం  మానేసారు. 

ఉద్యోగ విరమణ అయిపోయాక,రావుగారు  తీరిగ్గా  బుల్లితెర  చూడటం మొదలెట్టారు. ఆ నటుల నటన,సంభాషణలు ఏవీ ఆయనని రంజింప చేయలేక పోయాయి. 

ఒకరోజు  పొద్దున్నే  రావుగారి పాత మిత్రుడు  అతన్ని వెతుక్కుంటూ  వచ్చేడు.

"ఒరేయ్, నేనిప్పుడో సినిమాకి  దర్శకుడిని.ఒక పాత్ర కి నువ్వే న్యాయంచేకూర్చగలవు.మారుమాట్లాడకుండా  నాతో బయలుదేరు" అని తనతో  కారులో ఎక్కించుకుని  వెళ్ళిపోయాడు.

అలా మొదలయిన ఆయన  సినీ జీవితం లో ఎన్నో పాత్రలు, ఎందరో దర్శకులు. కళామతల్లి రావుగారిని మరో సారి అక్కున చేర్చుకుంది

No comments:

Post a Comment