Saturday, 2 November 2024

గురుపూజ

 ఇది నా స్వీయ రచన 

గురుపూజ


ఆరోజు  గురుపూజ దినోత్సవం. అందరు గురువులకీ ఎవరో సన్మానం చేస్తారట అని బడిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. 

ఇంతలో ఒక పెద్ద కారు బడిగేటు ముందు ఆగింది. అందులోనుండి ఒక వ్యక్తి దిగి బడిలోకి  వచ్చాడు. 

అతను ముందుగానే చేసిన ఏర్పాట్ల వల్ల సన్మాన సభ‌ మొదలైంది. 

అతని పేరు శ్రీనివాస్.అందరు గురువులనీ సముచితంగా సత్కరించి  తన  గురించి  చెప్పడం మొదలెట్టాడు. 

"నేను  ఈ బడిలో ఈ గురువుల దగ్గర చదువుకున్నవాడినే.అయితే నాకు చదువు  బాగా  రాలేదు.వ్యాపారంలో కొంత రాణించేను.నా ఈ అభివృద్ధికి నా గురువులే కారణమని నేను ఎప్పుడూ భావిస్తాను.అందుకే ఈరోజున గురుపూజ తలపెట్టాను."

తమ వద్దకి ప్రత్యేకించి వచ్చి, అందరినీ సన్మానించిన ఆ శిష్యుని ఆ తరువాత ఆ గురువులెవరూ మరిచిపోలేదు.

No comments:

Post a Comment