ఇది నా స్వీయ రచన
కళ్యాణం
గోపాల్రావు అలివేణి దంపతులకు ముగ్గురు సంతానం.పెద్దమ్మాయి సుధ.రెండో అమ్మాయి శ్రావణి. అందరికన్నా చిన్నవాడు భాస్కర్.
గోపాల్రావు తన కూతుళ్ళకు కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయకూడదని, అలా చేయటం నేరమని, తన కూతుళ్ళని అవమానించినట్టేనని భావించాడు.
కొన్నాళ్ళు పోయాక భాస్కర్ తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టి,ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.
మరి కొన్నాళ్ళకు శ్రావణి కూడా తనని ఇష్టపడిన అబ్బాయితో ఊరు వదిలి వెళ్ళిపోతుంది. సుధ తల్లితండ్రుల సంరక్షణ భారాన్ని తన నెత్తిమీద వేసుకుంటుంది.
ఒకరోజు గోపాల్రావు దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి "నేను మీ అమ్మాయి సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.నేను ఏ కట్నకానుకలు ఆశించడం లేదు. మిమ్మల్ని మీ అమ్మాయి చూసుకుంటోంది కాబట్టి నేనే మీతో ఉండి తనకి చేదోడు వాదోడుగా ఉంటాను" అని చెప్తాడు .
తమ కూతురికి కళ్యాణ ఘడియ వచ్చిందని గోపాల్రావు దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.
No comments:
Post a Comment