ఇది నా స్వీయ రచన
మహా నటి
మహానటి అనగానే మనకు సావిత్రి గుర్తుకు రావలసిందే. ఒకానొక సమయంలో హీరో ఎవరైనా నాయిక మాత్రం సావిత్రి.మాయాబజార్, మిస్సమ్మ ..ఇలా సినిమా పేరు తలుచుకుంటే సావిత్రి నటన కళ్ళ ముందు మెదులుతుంది.
పురుషాధిక్య సినీరంగం లో ఒకప్పుడు సావిత్రిదే హవా.
కల్కి విజయం సామాజిక మాధ్యమాలు హోరెత్తిస్తున్నా ఆ దర్శకుని మహానటి నాకు ఎక్కువ నచ్చిన సినిమా.
ఏ కేంద్ర ప్రభుత్వమయినా సావిత్రిని భారతరత్న గా ప్రకటిస్తే తరువాతి ఎన్నికల్లో ఆ పార్టీ కి ఓటు వేసేస్తా.
No comments:
Post a Comment