Saturday, 2 November 2024

అత్తాకోడలు

 ఇది నా స్వీయ ‌రచన

అత్తాకోడళ్ళు 


అత్తాకోడళ్ళు  అయినా వారిద్దరి మధ్య బంధం తల్లీకూతుళ్ళ బంధం,అక్కాచెల్లెళ్ళ అనుబంధం. 

పొద్దుట  సాయంత్రం  టిఫిన్, వంట అన్నీ   వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటారు.కూరలు, మిగతా సామాను ఏమేం కావాలో అత్తగారు చెప్తే  కోడలు తెస్తుంది.ఇంట్లో ఆదాయవ్యయాలు,ఆరోగ్య సమస్యలు అన్నీ వాళ్ళిద్దరే చర్చించుకుంటుంటారు.ఇద్దరూ సొంత ఇంటికోసం డబ్బులు కూడబెట్టే పనిలో ఉంటారు. 

ఇంటి పెద్దాయన వెంకటయ్య ఇంటికి ఏ బంధువులు వచ్చినా ఓ రెండురోజులు ఉండి వెళ్ళమని చెప్తుంటాడు.వండివార్చే కష్టం అత్తాకోడళ్ళది.పిల్లల చదువు సక్రమంగా జరగదు. 

వెంకటయ్య గారి అబ్బాయి మాధవ్ ఆఫీసుపని, ఓవర్ టైమ్ వీటితో బిజీగా ఉంటాడు. సెలవురోజు పిల్లలతో గడుపుతుంటాడు.

మాధవ్ భార్య రాధిక పిల్లలతో పుట్టింటికి వెళ్తే వాళ్ల అత్తగారికి  ఏమీ తోచదు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటుంది. రాధిక కూడా  వాళ్ళ అత్తగారికి  కొంచెం నలతగా ఉన్నా ఎక్కువ దిగులు పడుతుంది.

మాధవ్ కి  కూడా తల్లి ఆరోగ్యం గురించి ఎక్కువ చింత ఉండేది. 

మాధవ్ తల్లికి కాన్సర్ అని వైద్యపరీక్షలలో తేలుతుంది. ట్రీట్మెంట్ మొదలుపెట్టినా వారం తిరగకుండానే ఆవిడ  కనుమూస్తుంది.

రాధిక కి ఇంకా తన అత్తగారు తమతోనే ఉంటూ,తనకు అన్నీ చెప్తున్నట్టే ఉంటుంది.

No comments:

Post a Comment