Sunday, 3 November 2024

మార్పు

 ఇది నా  స్వీయ ‌రచన 

మార్పు 


వర్ధనమ్మ పిల్లల ఆట చూస్తోంది 

ఆ పిల్లల జట్టులో  నుండి ఒక అబ్బాయి  వచ్చి ఆవిడ ‌పక్కని కూర్చున్నాడు. 

"ఏమ్మా  ఆట మానేసావు" అడిగింది  వర్ధనమ్మ. 

"వాళ్ళు  నన్ను లడ్డూ  అని పిలుస్తున్నారు " ఉక్రోషంగా అన్నాడు  ఆదిత్య. 

ఆటలో  ఔట్ అయిన మరో  అబ్బాయి  ఆదిత్య  దగ్గరికి  వచ్చి రమ్మని  పిలుస్తున్నాడు. 

వర్ధనమ్మ  "మీరు  ఆదిత్యని  అలా  ఎందుకు  పిలుస్తున్నారు "అని ‌అడిగింది. 

" మా జట్టు నాయకుడు  వసంత్. వాడు అలానే పిలుస్తాడు. అందుకే  మేమూ అలాగే  పిలుస్తాం."అన్నాడు వాడు.  

ఆదిత్య  కొంచెం  మెత్తబడి  మళ్ళీ  ఆటలో  చేరేడు. వర్ధనమ్మ  వాడి గురించే ఆలోచిస్తోంది.

ఇంతలోనే  అక్కడ  కలకలం. 

ఆట ఆగిపోయింది. ఒక వికెట్  విరిగిపోయింది .ఎలా  ఆట  కొనసాగించాలా అని  నానా తంటాలు పడుతున్నారు. 

"ఆదిత్యా, ఇలారా.వసంత్ ని కూడా ‌పిలువు" అంది వర్ధనమ్మ. 

వసంత్  వచ్చేడు. 

వర్ధనమ్మ  వసంత్  తో "మా ఇల్లు  ఇక్కడే. మా ఇంట్లో  కొత్త  వికెట్లు మా  మనవల కోసం  కొన్నవి ఉన్నాయి.వస్తే నీకిస్తాను. కానీ,ఇక మీదట ఆదిత్యని మీరెవరూ లడ్డూ ‌అని పిలవకూడదు " అంది. 

వసంత్  "నేను  మీ ఇంటికి  వస్తా " అంటూ  ఆవిడ తో  నడిచాడు

No comments:

Post a Comment