ఇది నా స్వీయ రచన
పెంపకం
శంకరం మాస్టర్ శాస్త్రీయ సంగీత కళాకారులు.ఆయనకి ఎందరెందరో శిష్యులు.
శంకరం మాస్టారి స్నేహితుడు సుందరం. అతని కుమారుడు వినయ్ చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు.వినయ్ చిన్నప్పటినుండి శంకరం మాస్టారి అబ్బాయి మోహన్ తో పాటు సంగీతం అభ్యసించాడు.
వినయ్ తండ్రి మరణిస్తే శంకరం మాస్టర్ వినయ్ ని తన ఇంట్లోనే ఉంచుకొని తండ్రిలా సాకుతాడు.
పెద్దయ్యాక మోహన్ కి సినిమా పాటలు పాడాలన్న కోరిక ఎక్కువై తల్లితండ్రులని, తన ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. కాని వినయ్ శంకరం మాస్టారికి కచేరీలలో తోడుగా ఉంటూ,సంగీత సాధన చేస్తూ అక్కడే ఉండిపోయాడు.అందరూ వినయ్ ని శంకరం మాస్టారి సంగీత వారసుడిగానే భావిస్తారు.
No comments:
Post a Comment