ఇది నా స్వీయ రచన
బావగారు
దివ్యకి తల్లితండ్రులు ఆర్భాటంగా ఎంగేజ్మెంట్ జరిపించేరు.వారం తిరగక మునుపే దివ్య బైక్ ని ఒక కారు ఢీ కొంది.కారు నడుపుతున్న వ్యక్తి దివ్యని వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు కానీ దివ్యకి ఒక కాలు తీసేయాల్సివచ్చింది.
దివ్య ఇంటికి వచ్చాక, ఆ సంబంధం కుదిర్చిన అతను వచ్చి "వాళ్ళు మరో సంబంధం చూసుకుంటున్నారు.నిశ్చితార్ధం లో వాళ్ళు పెట్టిన నగ,అబ్బాయి దివ్యకి పెట్టిన ఉంగరం వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి" అని చెప్తాడు.
దివ్య అక్క మైథిలి వచ్చి "నువ్వు నాతో వచ్చి కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు.మాకు బావుంటుంది " అని చెప్పి వాళ్ళింటికి తీసుకొని వెళ్తుంది.
దివ్య బావగారు రఘురాం మంచి చిత్రకారుడు.దివ్య ఆయన దగ్గర శిష్యరికం చేసి తను కూడా బొమ్మలు గీయడం,పెయింటింగ్ వేయడం అలవాటు చేసుకుంటుంది.
ఒకరోజు మైథిలి దివ్యతో"నువ్వే మాకు పాపవి.మీ బావగారు అమ్మలా చూసుకొమ్మని నాతో చెప్పేరు.నువ్వు ఇంక మాతోనే ఉండు"అంది దివ్యని ముద్దులాడుతూ.
దివ్య తన బావగారి పితృవాత్సల్యానికి అంజలి ఘటిస్తూ కళ్ళంట నీళ్ళు పెట్టుకొంది.
No comments:
Post a Comment