Saturday, 2 November 2024

ఓ తల్లి తీర్పు

 ఇది నా స్వీయ ‌రచన 

ఓ తల్లి తీర్పు 


తులసమ్మకి  కొడుకు, మనవడు పంచప్రాణాలు.కొడుకు, కోడలు చిలకా గోరింకల్లా  ఉంటే చాలు అనుకునేది. ఇంట్లో చాకిరీతో ఆవిడకి రోజులు గడిచిపోయేవి. 

అప్పుడప్పుడు కోడలి పుట్టింటివాళ్ళు వచ్చి రోజులతరబడి ఉండేవారు.తులసమ్మ విశ్రాంతి లేకపోయినా ఏ ఫిర్యాదు చేసేదికాదు. 

ఓ రోజు తులసమ్మ కొడుకుతో "మీ మేనత్త సుశీల ఓ వృధ్ధాశ్రమంలో చేరింది.నన్నూ అక్కడకి వచ్చేయమంది.ఆ ఆశ్రమంలో నా స్నేహితురాళ్ళు మరి కొంతమంది కూడా ఉన్నారు. నేను  రేపు అక్కడకి వెళ్ళిపోతాను " అని చెప్పింది. 

అప్పటికి గాని తులసమ్మ కొడుక్కి తను ఏం నష్టపోతాడో,తల్లి విలువేంటో అర్ధం కాలేదు "

No comments:

Post a Comment