ఇది నా స్వీయ రచన
వాగ్దానం
ఆనందరావు గారు ప్రముఖ న్యాయమూర్తి. ఎన్నో కేసులలో నిష్పక్షపాతంగా తీర్పునిచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే ఒక కేసులో నిరపరాధికి శిక్ష పడుతుంది. ఆ శిక్షాకాలంలోనే అతను మనస్తాపం తో మరణించేడు.
ఆ నిరపరాధి మరణానంతరం అతని కుమారుడు ప్రతాప్ కి ఆనందరావు పట్ల ద్వేషం మరింత పెరిగింది. ఆయనని హతమార్చాలని నిర్ణయించుకుని తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు.
ఒకరోజు ఆయన కోర్టు నుండి ఇంటికి చేరుకున్న సమయంలో అతనిపై కత్తితో దాడిచేసి ఆయనని తీవ్రంగా గాయపరుస్తాడు.ప్రతాప్ తప్పించుకునేలోగా సెక్యూరిటీ గార్డు తుపాకీ నుండి వచ్చిన గుళ్ళు ప్రతాప్ భుజంలోకి దూసుకెళ్తాయి.
ప్రతాప్ ని అతని స్నేహితుడు ఆసుపత్రి లో చేర్పిస్తాడు.ప్రతాప్ కి వైద్యం చేసిన సౌమ్య ఆనందరావు గారి అమ్మాయి. సౌమ్య ప్రతాప్ తన తండ్రిని ఎందుకు గాయపరిచాడో అతని స్నేహితుడి నుండి తెలుసుకుంటుంది.
ప్రతాప్ కోలుకున్నాక సౌమ్య ప్రతాప్ తో "మీరు నాకు వాగ్దానం చేయాలి. మీరు మా నాన్నగారిమీద ఇంకెప్పుడూ దాడిచేయకూడదు.మీమీద పెట్టినకేసు నేను వెనక్కి తీసుకుంటాను.మీరు శాశ్వతంగా ఈ హింసామార్గాన్ని విడనాడాలి" అంది.ప్రతాప్ కి తన ప్రాణాలు కాపాడిన సౌమ్యకి చేసిన వాగ్దానం నిలబెట్టుకోక తప్పలేదు.
No comments:
Post a Comment