Saturday, 2 November 2024

సంస్కారం

 ఇది నా  స్వీయ  ‌రచన

 సంస్కారం 


ఆరోజు జరిగింది నేను  ఇప్పటికీ మరిచిపోలేదు. 

ఒక కుటుంబ ఫంక్షన్ హడావుడిలో మేమంతా ఉన్నాం. పిల్లలంతా ముందు రోజు సాయంత్రం నుండి పని చేసి, కబుర్లు చెప్పుకుంటూ అలిసిపోయి ఉన్నారు. నా పరిస్థితి అలాగే ఉంది. 

ఇంతలో నా చిన్ననాటి  స్నేహితురాలు వచ్చింది. నేను చాలా సంబరపడిపోయి  మా పిల్లలని పిలిచి తనకి చూపించా.

వాళ్ళు అసలే నిద్రమత్తు లో ఉంటే ఈ పరిచయాలు ఏంటనుకున్నారేమో.

నా స్నేహితురాలు "పై చదువులు, ఉద్యోగం  గొడవ లో పడి నీ పిల్లలకి సంస్కారం నేర్పించలేదా" అని అడిగేసింది. 

పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా, పిల్లల ఎదుటే ఆమాటంటే ఆలేత హృదయాలు  ఎలా బాధపడతాయో మనం తెలుసుకోవడం  మన సంస్కారం మీదే ఆధారపడి ఉంటుంది.

No comments:

Post a Comment