Saturday, 2 November 2024

స్నేహం

 ఇది  నా స్వీయ ‌రచన 

స్నేహం 


రంగారావు, రామారావు  స్నేహితులు.రంగారావుకి వ్యాపారం కలిసి వచ్చి ధనికుడయ్యాడు.రంగారావు ఏకైక సంతానం మాధురి.రామారావు పిల్లలు రాజా,రమ్య.

మాధురి, రమ్య చిన్నప్పటి నుండి స్నేహితులు. 

రంగారావు కి వ్యాపారం లో బాగా నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు.మాధురిని, ఆమె తల్లిని రామారావు, అతని భార్య ఆదుకుంటారు. 

మాధురి  మోడలింగ్  రంగంలో అడుగుపెట్టి,సినిమా  రంగంలో అవకాశాలు రావడంతో నాయిక పాత్రలు పోషిస్తుంటుంది.

రాజా  ఇన్ కమ్ టాక్స్ శాఖలో పని చేస్తుంటే, రమ్య  మహిళా కళాశాలలో లెక్చరర్ అవుతుంది. 

కొన్నాళ్ళ తర్వాత  మాధురి కి సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.మాధురి తల్లి కూడా మరణిస్తుంది.రమ్య  మాధురిని పెళ్లి  చేసుకొని స్థిరపడమని సలహాయిస్తుంది.

మాధురి ఎవరినీ  నమ్మదు. కానీ  రాజాకి తన పట్లవున్న ప్రేమను అర్థం చేసుకుని ,అతనితో జీవితం  పంచుకుంటుంది.

No comments:

Post a Comment