ఇది నా స్వీయ రచన
హీరో
ఎవరికైనా తండ్రి హీరో. తండ్రి దుర్మార్గుడయితే అది వేరే సంగతి.
చిన్నప్పుడు నేను అన్నం తినేదాన్ని కాదని మా నాన్నగారే నాకు గోరుముద్దలు తినిపించేవారట.
మా కాలేజీకి ఒకే ఒక్కసారి నాన్న గారు వస్తే నాకెంత సరదావో.
మా నాన్నగారు మమ్మల్ని చాలా ఊళ్ళు తిప్పేవారు.
అదేమాట నేను మా పిల్లలతో అంటే "మా నాన్న చూపించినవి నీకు
గుర్తుకురావా" అని అడుగుతారు.
నేను చదువుకుంటే,ఉద్యోగం చేస్తే,ఓ కవిత రాస్తే....దేనికైనా నాన్నగారికి ఆనందమే.
మనవలచే ఓనమాలు దిద్దించి,వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఎంతో సంతోషించారు.
బాల్యం నుంచి మనతో ఉన్న హీరో, వాళ్ళ చివరి రోజు వరకు మనతో ఉండే హీరో నాన్నగారు .
No comments:
Post a Comment