ఇది నా స్వీయ రచన
ఎంపిక
ఆఫీసుకి ఎప్పుడూ హడావుడిగా రావడమే అలవాటయింది అరవింద్ కి .
"మీరొచ్చాక మిమ్మల్ని రమ్మన్నారు అమ్మగారు " అని చెప్తాడు అప్పారావు.
భయపడుతూనే అర్చన గదికి వెళ్తాడు అరవింద్. కూర్చోమని చెప్పి ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది అర్చన. అరవింద్ సమాధానాలు చెప్తుంటే నిశితంగా అతనిని పరిశీలిస్తూనే వింటుంది.
అరవింద్ ఆఫీసులో చేరేక ఆరునెలలు రోజూ ఇదే పరీక్ష అరవింద్ కి.
ఒకరోజు సాయంత్రం అరవింద్ ఆఫీసు నుంచి బయలుదేరేముందు అర్చన "నేను మీ ఇంటికి రావొచ్చా " అని అడిగింది. అరవింద్ "తప్పకుండా " అని అర్చనని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
అరవింద్ తల్లితండ్రులు, అన్న, వదిన,చెల్లి అందరూ అర్చనతో ఆప్యాయంగా మాటాడతారు.
మర్నాడు సాయంత్రం అర్చన "నేను నా జీవిత భాగస్వామిగా మిమ్మల్ని ఎంచుకున్నాను. నా నిర్ణయం మీకు నచ్చితే అన్నీ ఆలోచించుకుని నాకు చెప్పండి " అని అరవింద్ తో అంది.
అరవింద్ అసలు ఊహించని విషయం ఇది. తన ఇంట్లో కూడా ఈవిషయం చెప్తాడు.
అరవింద్ మర్నాడు సాయంత్రం వరకు ఎదురుచూసి అర్చన తో "మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తారు? మీవాళ్ళని నేను కలియాలికదా"అని అడుగుతాడు నవ్వుతూ, తన అభిప్రాయం చెప్పకనే చెప్తూ
No comments:
Post a Comment