Saturday, 2 November 2024

సెలవు

 ఇది నా స్వీయ  రచన 


సెలవు


సీతారావమ్మ కి చిన్నప్పుడే వంట నేర్పింది వాళ్ల ‌అమ్మ. తరువాత ఆమె  వంట చేయడం అవసరమైపోయింది. వాళ్ళ అమ్మ అనారోగ్యంతో రోజూ వంటచేయక తప్పలేదు. 

   పెళ్లయ్యాక  అత్తగారు తాళాలగుత్తి  అప్పచెప్పలేదు కానీ వంటిల్లు  అప్పచెప్పింది. సీతారావమ్మకి వంట చేయడం అలవాటే కాబట్టి చకచకా చేసేది.

     కాలం  గబగబా అడుగులు వేసేసి  ఆవిడకి అరవై ఏళ్ళు వచ్చేసాయి. వాళ్ళ ఆయన సుబ్బారావు భార్య వంటకి అలవాటు  పడిపోయి కోడలు  మాలతి ఒకపూట వంటచేసినా" సీతా వంట నువ్వే చెయ్యి "అని చెప్పేస్తాడు.


సీతారావమ్మకి వంట చేసి‌‌చేసి విసుగొచ్చింది. కలలో కూడా వంట  చేస్తున్నట్టే ఎప్పుడూ కలలు.


ఓ రోజు లేచి వంట చేయడానికి కూడా ఆవిడ లేవలేక పోయారు. కొడుకు డాక్టరుని పిలిస్తే అతను‌ ఆవిడని పరీక్షించి " సారీ,‌ఆవిడిక లేరండీ "అని చెప్పి  వెళ్ళిపోయారు. 

సీతారావమ్మ  వంటకీ, వంట  చేయించుకున్న అందరికీ  సెలవు  ప్రకటించి వెళ్ళిపోయారు.

No comments:

Post a Comment