ఇది నా స్వీయ రచన
కుందన
కుందన నిజంగా కుందనపు బొమ్మే. అయితే చిన్నతనం లోనే మానసికంగా, శారీరకంగా గాయాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు దగ్గర బంధువే వావి వరసలు లేకుండా ఆమెపై అఘాయిత్యం చేసాడు. ఆ మానవ మృగాన్ని జైలుకి పంపి నంతవరకూ ఆమె నిద్ర పోలేదు.
ఆ దుర్మార్గుడి ఫలితంగా కుందన గర్భం దాలిస్తే తల్లితండ్రులు ఆ గర్భం తీయించే ప్రయత్నం చేసేరు.కుందన "తండ్రి దుర్మార్గుడు అయితే బిడ్డదేం తప్పు " అని ఆ బిడ్డను కని తనే అన్నీ అయి పెంచింది.
కొన్నాళ్ళ తర్వాత కుందనతో పనిచేస్తున్న వివేక్ ఒకరోజు కుందనతో"నువ్వు నాకు చాలా నచ్చేవు.నీగురించి విన్నాక నువ్వు నాకు ఇంకా నచ్చేవు.నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్ళి చేసుకుందాం "అన్నాడు.
కుందన వివేక్ తల్లితండ్రులని కూడా కలుస్తానంది.వాళ్ళిద్దరూ కుందన తో " నీ గురించి వివేక్ అంతా చెప్పాడు.మీ పెళ్ళికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నీ కూతురు ఇకమీదట మా ముద్దుల మనవరాలు"అని అన్నారు.
కుందన వివేక్ ల పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది.
No comments:
Post a Comment