ఇది నా స్వీయ రచన
చెడుగుడు
ఉష పెళ్లి మనసుకి నచ్చిన వాడితో జరిపించారు ఆమె తల్లితండ్రులు . మోహన కృష్ణ వాళ్లింటి అల్లుడయ్యేడు.
ఉష చాలా చురుగ్గా ఉంటుంది.
అత్తగారికి, ఆడపడుచు కి,మామగారికి అందరికీ పెళ్లికి ముందే కానుకలిస్తూ అందరి మనసులకీ దగ్గరయింది.
పెళ్ళి అయ్యాక కొత్త అల్లుడు అత్త వారింటికి వచ్చేడు. తల్లీకూతుళ్ళిద్దరూ షాపింగ్ కి వెళ్ళేరు.
ఉష తండ్రి ఆనందరావు కొంత వంట పని, మరి కొంత ఇంటిపని చేసి హాల్లో అల్లుడి దగ్గరకి వచ్చి కూర్చున్నాడు.
ఆనందరావు మోహన కృష్ణ తో " మా ఉష అంటే నాకు చాలా ముద్దు. దానికది బాగా తెలుసు. అందుకు
దానికి కావలసినట్టు జరిపించుకోవడానికి నాతో చెడుగుడు ఆడేస్తుంటుంది"అన్నాడు నవ్వుతూ.
"ఈ ఆటలో ఎప్పుడూ అదే గెలుస్తుంది. దానికి ఆ తెలివి తేటలు, సమర్ధత ఉన్నాయి. నా కూతురి చేతిలో ఎన్నిసార్లు ఓడిపోవడం అయినా నాకిష్టమే. మీది కొత్త కాపురం కదా. చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోతే మంచిది. "
"ఈ విషయం లో మీ అత్తగారు నన్నే తప్పు పడుతుంది.నేను గారం చేసి పాడు చేస్తున్నానట. అది ఏదయినా అడిగితే కాదనలేక పోవడం నా బలహీనత."
"ఇది వరకు కోడళ్ళు, అత్తగార్లు,కూతుళ్ళు ఎన్నో త్యాగాలు చేసేవారు. ఇప్పుడూ కొందరు చేస్తారు. కానీ అందరూ చేస్తారనుకోలేం."
మామగారి అనుభవ సారం విన్నాక ఉష తనతో చెడుగుడు ఎప్పుడు మొదలెడుతుందన్న ఆలోచన లో పడ్డాడు మోహన కృష్ణ
No comments:
Post a Comment