ఇది నా స్వీయ రచన
ఆట
ఆట మొదలైంది. అంతకంటే ముందు నేను పేపర్లు దిద్దడం మొదలెట్టా.
ఆట ఆఖరి దశకు చేరుకున్నప్పుడు నేను దిద్దడం ఆపేసి ఆటని ఏకాగ్రతతో చూడటం మొదలెట్టా.
మన దేశం ఆట గెలుస్తుందా లేదా అన్నదే ఉత్కంఠ. ఇండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. ఆఖరి ఇద్దరు ఆటగాళ్ళు పరుగులు పెంచడానికి చెమటోడుస్తున్నారు.
ఆఖరి ఓవర్. ఆఖరు బంతికి ఆరు కొట్టి ఆట గెలిచారు.
ఆట అయిపోగానే నేను పేపర్లు దిద్దే కార్యక్రమం కొనసాగించేను.
No comments:
Post a Comment