ఇది నా స్వీయ రచన
హమ్మయ్య
ఇది సెల్ ప్రపంచం.ఇంకా రెండేళ్ళు నిండని బుడతలు కూడా సెల్ లాగేసుకుని తమకి కావలసినవి పెట్టేసుకుంటారు.పాటలు, డా న్సులు,అన్నీ. పెద్దలూ అంతే.ప్రయాణాలో అందరి చేతుల్లో సెల్ ఫోన్.
ఒకసారి మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం.రాత్రి వరకూ ఫోన్ మాటాడేనేమో,ఛార్జి అయిపోయింది. ఫోన్ ఛార్జి లో పెట్టా.స్టేషన్ వచ్చేసరికి మరిచిపోయి దిగిపోయా.కారు లో ఇంటికి వెళ్తుంటే గుర్తుకి వచ్చింది. గాభరా పడుతూ మావారితో చెప్పా.
మావారు "మన కంపార్ట్మంట్ అటెండర్ నాకు తెలుసు. తన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. చెప్పి చూద్దాం.
ఆ అబ్బాయి వెంటనే వెళ్లి చూడటంతో నాఫోన్ నాకు దొరికింది. హమ్మయ్య. అసలే పుట్టింటివాళ్ళు ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నది.
No comments:
Post a Comment