Saturday, 2 November 2024

పిక్ పోకెట్

 ఇది నా స్వీయ రచన 

పిక్ పాకెట్ 


గణేశ్ బస్సులో కొట్టేసిన పర్సులన్నీ తెరిచి చూసుకుంటున్నాడు, తన రాబడి లెక్క వేసుకుంటూ. 

అన్నీ బాగానే కిట్టేయి కానీ ఒక పర్సులో చిల్లర కాగితాలు తప్ప మరేమీ  లేవు,ఒక ఉత్తరం తప్ప.

ఆ ఉత్తరం విశ్వం వాళ్ళ అమ్మ కి రాసింది. ఆరోజే 2000రూపాయలు వాళ్ళ అమ్మకి మని ఆర్డర్ చేసేడని,మరో  2000రూపాయలు తన స్నేహితుడు సత్యానికి  తల్లి  మందులకోసం పంపినట్టు. 

చివరికి, ఆరోగ్యం  క్షీణిస్తే సత్యం సాయంతో  తను ఉన్న ఇంటికి  వచ్చేయమని తన చిరునామా  రాసేడు. 

అది  చదివేసరికి  గణేశ్ కి తాను కోల్పోయిన తన తల్లి  గుర్తొచ్చి కన్నీళ్లు ధారగా కారసాగాయి. 

గణేశ్ విశ్వం  పర్సు లో 5000 రూపాయలు  పెట్టి ఓ కాగితంమీద "అమ్మ జాగ్రత్త తమ్ముడూ" అని రాసి అది కూడా  పర్సు లో  పెట్టి,   విశ్వం రాసిన అడ్రసుకి వచ్చి ,ఆ పర్సుని ఆ ఇంట్లో కి  కిటికీ లోంచి విసిరి  వచ్చేస్తాడు.

No comments:

Post a Comment