Friday, 1 November 2024

అందాల విశాఖ

 ఇది నా స్వీయ కవిత 

అందాల  విశాఖ 


భరతమాత నడుం ఒంపుల్లో

సొగసైన పుట్టుమచ్చ విశాఖ


తెలుగుతల్లి ముత్యాల ముప్పేటలో

ముచ్చటైన శోభ విశాఖ


ఉత్తరాంధ్ర ఒయ్యారి భామ

సాగరతీర సోయగాలలేమ విశాఖ


గాలి ఓడల విమానాశ్రయం

సాగర జలాల్లో నిశిరాతిరి

జలకన్యల్లా మెరిసే ఓడల ఓడరేవు

నియాన్ వెలుగుల్లో నిత్య దీపావళి విశాఖ


ప్రకృతి మాత ముద్దుల తనయ విశాఖ

సుందరగిరుల అందాల లోయ విశాఖ

శివపార్వతుల వన విహారం కైలాసగిరి

అద్భుత త్రీడీ దృశ్యం సింహాద్రి

డాల్ఫిన్స్ నోస్-మెరుపు బాణాలు

వాడిగా విసిరే లైట్ హౌస్


పామ్ బీచ్ -రామకృష్ణ బీచ్ -ఉడా పార్క్

బంగారు జలతారు

జలజల జాలు వారే అలల ఇసుక

నిత్య నూతనంగా శోభాయమానంగా

ఇసుకపట్నం విశాఖపట్నం


మర్రిపాలెం వెంకోజీపాలెం

మువ్వలవానిపాలెం తాటిచెట్లపాలెం

మద్దిలపాలెం కంచరపాలెం

పాలెంల పట్నం విశాఖపట్నం


హెచ్ పిసి ఎల్ -బి హెచ్ పి వి -జింక్

కోరమండల్ ఫెర్టిలైజర్స్

షిప్ యార్డ్ స్టీల్ ప్లాంట్

కార్మిక విశాఖ పారిశ్రామిక విశాఖ


అంధ్ర విశ్వ కళాపరిషత్

అంధ్రా మెడికల్ కాలేజ్

శ్రీ శ్రీ -రాచకొండ

విద్యల విశాఖ విద్వత్ విశాఖ


సాగరపవనాల మితశీతోష్ణ స్థితి

లౌకిక సమస్థితి

కలతలు ఎరుగని పరిస్థితి

అందరు మెచ్చే విశాఖ


సింహాద్రప్పన్న కనక మహాలక్ష్మి

లౌకిక భావాలకు దర్పణం మూడు కొండలపై

పోర్ట్ లో వెలిసిన జీసెస్ బాలాజీ అల్లా

అందరికీ నచ్చే విశాఖ

అద్భుత దృశ్య కావ్యం విశాఖ


visteel mahilaa samiti souvenir,2008

No comments:

Post a Comment